Listen to this article

జనం న్యూస్ జనవరి 25 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ):- మండల కేంద్రమైన బీబీపేట గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రామసభ రసాభాసగా కొనసాగింది. అటు గ్రామస్తులు ఇటు అధికారుల మధ్య కొద్దిసేపు మాటలు యుద్ధం నెలకొంది. ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాలుగు పథకాలలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, విషయంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకతో అమలు చేయాలన్న ప్రభుత్వ సంకల్పమన్న విషయం తెలిసిందే అయితే ఈ సమావేశం ప్రారంభం కాగానే మొదట రైతు భరోసా అంశంపై వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ మండల కేంద్రంలోని గ్రామ కంఠంలో కింద వ్యవసాయ యోగ్యత లేని కారణంగా 58 ఎకరాల భూమిని రైతు భరోసా నుంచి తొలగించడం జరిగిందని ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు సుమారు 2250 లబ్ధిదారుల పేర్లు చదివి వినిపించారు. ఉపాధి హామీ పథకం లో పేరు ఉండి భూమి లేని వారికి 2023 సంవత్సరం 2024 సంవత్సరం లో 20 రోజులు పని చేసిన అర్హులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సంవత్సరానికి 12 వేల రూపాయల పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసి పేర్లు చదివి వినిపించారు. అలాగే కొత్త రేషన్ కార్డులు సుమారు 215 లబ్ధిదార్ల పేర్లు చదివి వినిపించారు. ఇంకా ఎవరైతే లబ్ధిదారులు తమ పేర్లు రానివారు దరఖాస్తు చేసుకోగలరని అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పూర్ణచంద్రోదయ కుమార్, తాసిల్దార్ సత్యనారాయణ, ఈవో గూడ రమేష్, వ్యవసాయ అధికారులు, రాఘవేందర్,ఎస్సై ప్రభాకర్, పోలీస్ సిబ్బంది, కారోబార్ సిద్ధ రాములు,గ్రామ సిబ్బంది. ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.