

జుక్కల్ జులై 5 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం నాగుల్గామ్ గ్రామము లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రావర్ నిర్వహించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “అగ్రి స్టాక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్”(రైతు నమోదు) లో భాగంగా ప్రతి రైతు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు. రైతు పేరు నమోదు చేసుకోవడానికి ఆధార్ కార్డు, ఆధార్ కార్డు కు లింక్ అయి వున్న మొబైల్ నెంబర్ తప్పనిసరిగా తీసుకొనివెళ్ళాలి ( 3 సార్లు OTP రావడం జరుగును). రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ లో నమోదు చేసుకోగానే 2 రోజుల తర్వాత 11అంకెల సెంట్రల్ ఐడి లేదా ఫార్మర్ ఐడి నెంబర్ రైతు ఆధార్ కు లింక్ వున్న మొబైల్ నెంబర్ కు రావడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు పీఎం కిసాన్ తదుపరి విడత కోసం తప్పనిసరి. అదేవిధంగా పీఎం ఫసల్ భీమ యోజన కోసం, బ్యాంక్ ల నుండి పంట రుణాలు పొందడానికి, భవిష్యత్తులో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కూడా ఈ ఫార్మర్ 11 అంకెల నెంబర్ తప్పనిసరి కానుంది. కావున రైతు సోదరులు అందరు నమోదు చేసుకోవాలిందిగా కోరుచున్నాము.
