

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బీఆర్ నాయుడు ని జనసేన పార్టీ రాష్ట అధికార ప్రతినిధి కీర్తన సహకారంతో నందలూరు మండల జనసేన నాయకులు కొట్టే శ్రీహరి మర్యాద పూర్వకంగా కలవడం జరిగినది.TTD చైర్మన్ బీఆర్ నాయుడు ని నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా 11-7-2025 వ తేదిన ఉదయం 10గంటలకు జరుగు స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనమని బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి అహ్వ నించడం జరిగింది.TTD చైర్మన్ బీఆర్ నాయుడు సానుకులంగా స్పందించారు.ఆనంతరం నందలూరు జనసేన నాయకులు ఆయనకు శ్రీ సౌమ్యనాథ స్వామి చిత్రపటాన్ని అందజేయడం జరిగింది.