Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 7 రిపోర్టర్ సలికినీడి నాగు

ఏకలవ్యుని విగ్రహాన్నికి నివాళులు అర్పించి, మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రత్తిపాటి.

చిలకలూరిపేట: ఏ.పీ గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏకలవ్యుని జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ మంత్రివర్యులు, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఆదివారం పట్టణములోని నరసరావుపేట సెంటర్లో గల రైతు బజార్ వద్ద గల ఏకలవ్యుడి విగ్రహాన్నికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రిబ్బన్ కట్ చేసి మహా అన్నదాన కార్యక్రమాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా తో ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ మహాభారతంలో గురు భక్తిని చాటిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఏకలవ్యుడని పేర్కొన్నారు. ద్రోణాచార్యుని గురుకులంలో విలు విద్యను అభ్యసించాలని కోరికతో ద్రోణాచార్యుని వద్దకు వెళ్లడంతో ఆయన తిరస్కరిస్తారు. ఎలాగైనా విలువిద్య నేర్చుకోవాలనే దృఢమైన సంకల్పం తో ద్రోణాచార్యుని ప్రతిమను బంకమట్టితో తయారు చేసి అతని విగ్రహాన్ని ప్రతిష్టించికొని విలువిద్యను నేర్చుకున్న మహోన్నతమైన వ్యక్తి ఏకలవ్యుడు అని తెలిపారు. తన గురు భక్తిని చాటుకోవడం కోసం బ్రొటన వేలు ను త్యాగం చేసిన మహావీరుడు ఏకలవ్యుడు అని తెలిపారు. తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమం చేయడం పట్ల గిరిజన సంఘాల నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, తుపాకుల అప్పారావు, మద్దుమాల రవి, గట్టినేని రమేష్, తోట బ్రహ్మస్వాములు, ఏ.పీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. శ్రీను నాయక్, నియెజకవర్గ గౌరవ అధ్యక్షులు పాలపర్తి బాబు, పట్టణ అధ్యక్షులు పాలపర్తి శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు బి.చిన్న నాయక్, నాయకులు యం.వెంకటేష్ నాయక్, బి.శివ నాయక్, పుట్టా వెంకట బుల్లోడు, డి.గోపినాయక్, కొర్నే పాటి నాగరాజు, కె. రామాంజనేయులు, చుండూరి ఆనంద్ బాబు,నేలం యేసు రాజు తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.