Listen to this article

రుద్రభూమిలో ఆక్రమణను తొలగించేందుకు పంచాయతీ తీర్మానం

జనం న్యూస్,జూలై07, అచ్యుతాపురం:


అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ చేపల సుహాసినీ
అధ్యక్షతన గ్రామ పంచాయతీ సాధారణ సమావేశంను వార్డు సభ్యులతో నిర్వహించారు.ఈ సమావేశంలో ప్రధాన అంశమైన పూడిమడక రెవెన్యూ సర్వే నెం:127/2లో 2.30 ఎకరాలు రుద్రభూమిలో ఆక్రమణను తొలగించేందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శి స్థానిక ఎంపీడీఓ ద్వారా అచ్చుతాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ కు పిర్యాదు చేసినా తగు చర్యలు తీసుకోలేదని తదుపరి కార్యాచరణ నిర్ణయించడానికి గ్రామ పంచాయతీ ఆమోదం కోరడం జరిగిందని,గత నెల జమలు ఖర్చులు ఆమోదం కోరుట గురించి జాలరిపాలెం,కొండపాలెం అంగన్వాడీ సెంటర్లులో నిర్మించిన అసంపూర్తి టాయిలెట్స్ పూర్తి చేయడానికి అలాగే కొండపాలెం గ్రామం 9వ వార్డులో నిర్మించిన సిసి రోడ్డునకు 5 కాల్వర్టులు అప్రోచ్ రోడ్డు మరియు సిసీ డ్రెయిన్లు నిర్మించుటకు అయ్యే
ఖర్చును 15 వ ఆర్ధిక సంఘం నిధుల నుండి ఖర్చు చేయడానికి మరియు పూడిమడక పంచాయతీ పరిధిలో గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా కోవిరి మహేష్ కడపాలెంలో వేసిన అక్రమ ఇంటి కుళాయులు గుర్తించి గ్రామ పంచాయతికి జరిగిన నష్టాన్ని లెక్కించి సదరు వ్యక్తి పై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అలాగే 2024-25 సంవత్సరం కమేళా రోజు వారి మార్కెట్ వారపుసంతకు డిఎల్పిఓ నర్సీపట్నం వారు మద్దతుధర త్వరగా తీసుకొని వచ్చి వేలంపాట నిర్వహించాలని,పూడిమడక గ్రామ పంచాయతీ రెవెన్యూ సర్వే నెం:90లో 36 సెంట్లు స్థలంలో ఔటర్ బస్ స్టాండ్ అభివృద్ధి చేయడానికి అయ్యే ఖర్చును 15 వ ఆర్ధిక సంఘం నిధుల నుండి ఖర్చు చేయుట గురించి అలాగే పూడిమడక గ్రామ పంచాయతీ సర్వే నెం:90 లో 25 సెంట్లు విస్తరణలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం దాతలు విరాళాలతో నిర్మించుటకు కొండపాలెంకు చెందిన గనగళ్ల నరసింహ స్వామి గ్రామ పంచాయతీ స్థలంను ఆమోదం కొరకు మరియు కోవిరి సన్యాసిరావు పిరమిడ్ ప్లాన్ పరిశీలిన తదితర అంశాలు పై గ్రామ పంచాయతీ కార్యదర్శి సరస్వతి ఆధ్వర్యంలో
గ్రామ సర్పంచ్ పూడిమడక వారి అనుమతితో తీర్మానం చేశారు. ఈ సమావేశంలో అనకాపల్లి పార్లమెంట్ టిఎన్టియుసి ప్రధాన కార్యదర్శి మరియు వార్డు సభ్యులు పొన్నమళ్ల కొండబాబు,మేరుగు అప్పలరాజు,దానయ్య,కొండయ్య తదితర వార్డు సభ్యులు పాల్గొన్నారు.