

గ్రామసభల్లో గొడవలు సృష్టించడం బాధాకరం..
జనం న్యూస్ //జనవరి //25//జమ్మికుంట //కుమార్ యాదవ్:- హుజురాబాద్ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి పై దృష్టి పెట్టాల తప్ప ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామసభల్లో గొడవలు సృష్టించడం బాధాకరం..అని అంబాలా రాజు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అన్నారు.హుజురాబాద్ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి 1000 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి గొప్పగా అభివృద్ధి చేస్తానని మాటను విస్మరించి హనుమకొండ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల కేంద్రంలో జరిగిన ప్రజా పాలన గ్రామసభలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ను విమర్శించడం తగదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా అంబాల రాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరం కాలంలోనే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ఐటీ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుదిల్ల శ్రీధర్ బాబు భారీ నీటిపారుదల శాఖ మరియు కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు నలమంద ఉత్తంకుమార్ రెడ్డి ల ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ అందుతున్నాయి ఏకకాలంలోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ సన్నపు వడ్లకు 500 బోనస్ మహిళా సోదరీమణులకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఉచిత గ్యాస్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం ప్రభుత్వ ఉద్యోగస్తులకు వారు కోరుకున్న ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది, అన్నారు.టెట్టు పరీక్ష నిర్వహించి డీఎస్సీ ద్వారా ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు పోలీసు మరియు గ్రూప్ వన్ గ్రూప్ టు ద్వారా అనేక నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన వాళ్లను ఆదుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాం అని తెలిపారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వము 9 సంవత్సరాల కాలంలో బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి డబల్ బెడ్ రూమ్ లు ఇంటికొక ఉద్యోగం దళితులకు మూడెకరాల భూమి దళితున్ని ముఖ్యమంత్రి ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత వారికే దక్కింది అన్నారు.ఇప్పటికైనా హుజురాబాద్ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన 1000 కోట్ల హామీని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ఐటీ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి నలమంద ఉత్తంకుమార్ రెడ్డి దగ్గరికి వెళ్లి 1000 కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలి తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని అబ్బాస్ పాల్చేసి గొడవలు సృష్టించి ఐదు సంవత్సరాలు కాలం వెలదీయాలని చూస్తే ఊరుకోమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్న,అన్నారు.