

జనం న్యూస్,జూలై07, అచ్యుతాపురం:
అనకాపల్లి జిల్లాలో ఏడు మండలాలలో మత్యకారులు చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని,’అచ్యుతాపురం మండలం, పూడిమడక గ్రామం అతిపెద్ద మత్స్యకార గ్రామం. ఈ గ్రామంలో సుమారు 16 వేలు జనాభాలో ఎక్కువ మంది చేపలవేట ద్వారా జీవనం సాగిస్తున్నారని,జూలై
02 బుధవారం తెల్లవారు జామాన సుమారు 2 గంటల సమయంలో వాసుపల్లి యల్లాజీ, చోడపల్లి యర్రయ్య, కొర్లయ్య, గనగళ్ళ అప్పలరాజు వీరు నలుగురు మత్యకారులు కలిసి చేపల వేటకు వెళ్లడం జరిగిందని, గేలంతాడు సహాయంతో చేపల వేట చేయగా గేలంతాడికి సుమారు 100 కేజీల నుండి 300 కేజీల అతిపెద్ద కొమ్ముకోనాం చేప పడిందని, చేపను నెమ్మదిగా తెప్పవద్ద లాగగా దానికి చోడిపల్లి యర్రయ్య అనే మత్యకారుడు కొమ్ముకోనాం చేపకి పైగేలం వేయగా ఆ చేప ఉవ్వెత్తున వేగంతో పై గేలం తాడుతో కలిపి చోడిపల్లి యర్రయ్యను సముద్రంలోకి లాగికొను పోయిందని తోటి మత్స్యకారులు తెలిపారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడిని వెంటనే వెతికినా జాడ కనపడలేదని గ్రామస్థులకు విషయం తెలియజేశారు.తోటి మత్యకారులను తీసుకొని మరో 6 ఇంజన్ తెప్పలుతో వెతికినా ఎక్కడా జాడ కనిపించలేదన్నారు.
గల్లంతైన మత్స్యకారుడు నేటి వరకు ఆచూకీ లభ్యం కాలేదని,త్రీమేన్ కమిటీ,రెవెన్యూ,మత్స్య మరియు పోలీస్ శాఖ వారు కలిపి నివేదిక తొందరగా ఇప్పించుటకు ఆదేశాలు జారీ చేయగలరని, తనపై జీవన ఆధారపడ్డ కుటుంబసభ్యులు తల్లి, ఇద్దరు చెల్లెలు, తమ్ముడు జీవన విధానం కోసం ప్రభుత్వం ఆ కుటుంబానికి నష్టపరిహారం మంజూరు చేస్తారని అనకాపల్లి జిల్లా సాంప్రదాయ మత్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య అధ్యక్షులు చోడిపల్లి దేముడు,రాష్ట్ర కార్యదర్శి,వైస్ ఎంపీపీ వాసుపల్లి శ్రీనువాసు రావు పీజీఆర్ఎస్ వినతిపత్రాన్ని అందించారు.
