

సీఎం సహాయనిధితో పేద ప్రజలకు ఉపశమనం
ఎమ్మెల్సీ దండే విఠల్
జనం న్యూస్ జులై 07 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
_కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ 26 వర్డ్ కు చెందిన షేక్ పెంటు కి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన సుమారు 60.000 రూపాయల చెక్కులను ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ లబ్ధిదారునికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఆస్పత్రులు పాలైన నిరుపేదల కోసం సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు నిరుపేదలు ప్రతి ఒక్కరు సీఎం సహాయనిధి పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు