

జనం న్యూస్ జూలై 08(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
మునగాల మండలం తాడువాయి గ్రామంలో కొద్దిపాటి వర్షానికి తాడువాయి గ్రామంలోని పలు వీధుల్లో, డ్రైనేజీ సమస్య వల్ల సీసీ రోడ్డులపై నీళ్లు నిలిచిపోయి వీధులు బురదమయంగా మారుతున్నాయని,మాజీ జెడ్పిటిసి కోల ఉపేందర్ రావు అన్నారు.రానున్న రోజుల్లో పెద్ద వర్షాలు పడితే స్థానిక ప్రజలకు మరింత ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని,వెంటనే సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను సోమవారం ఒక ప్రకటనలో కోరారు.