Listen to this article

జనంన్యూస్. 09.సిరికొండ.

సిరికొండ మండలం 1974 నుండి విప్లవ రైతుకూలీ సంఘానికి ముఖ్యమైన కేంద్రంగా నిలిచింది. విప్లవ రైతు కూలీ సంఘం ఇక్కడ కేంద్రీకరించి పనిచేసింది. మొదట ఏపీ రైతు కూలీ సంఘంగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసినప్పటికీ. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆవిర్భవించిన సందర్భంగా అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయు కె ఎస్)గా రూపాంతరం చెందింది. ప్రస్తుతం మండల, డివిజన్ సాయి మహాసభలను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం జరిగిన అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయు కె ఎస్) మోర్తాడులో జరిగిన నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా మహాసభ ల్లో సిరికొండ వాసులకు ముగ్గురికి జిల్లా స్థాయి పదవులు దక్కాయి. బి బాబన్న (రావుట్ల)జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపిక కాగా, రిక్క.దామోదర్ ( రావూట్ల )కార్యదర్శిగా, మలికి లింబాద్రి ( గడ్కోల్ ) కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.