

జనం న్యూస్ జూలై 10(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
మునగాల మండల కేంద్రంలో కార్మిక,కర్షక,వ్యవసాయ కార్మికుల విధానాలను వ్యతిరేకిస్తూ బుధవారం దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా మండల కేంద్రంలో సీఐటీయూ,రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో. భారీ ప్రదర్శన నిర్వహించన ఆశ వర్కర్స్,మధ్యాహ్న భోజనం కార్మికులు, ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్, భవన నిర్మాణ కార్మిక సంఘం, గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్,పెయింటర్స్ వర్కర్స్ యూనియన్, కార్మికులు సమ్మె నిర్వహించడం జరిగినది. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శన అనంతరం జరిగిన సభ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు అధ్యక్షతన జరిగినది పలువురు రాజకీయ పార్టీల నాయకులు,కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. బిజెపి ప్రభుత్వం మూడవసారి అధికారులకు వచ్చి కార్మిక, కర్షక,ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ. కార్మికులు 100 సంవత్సరాలు పోరాడి త్యాగాలతో సాధించుకున్న,29 కార్మిక చట్టాలను రద్దు పరుస్తూ, నాలుగు లేబర్ కోడ్ లను తీసుక వచ్చిందన్నారు.వాటిని కార్మిక వర్గాల హక్కులను హరించినట్లేనని అన్నారు. కార్మికులందరూ సంగటితమై బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు పరిచేంతవరకు పోరాడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిరి నాగిరెడ్డి,సిపిఐ చిల్లంచర్ల ప్రభాకర్,సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, ఏఐటీయూసీ నాయకులు రాఘవరెడ్డి,ఐ ఎన్ టి యు సి నాయకులు అబ్బాస్, రైతు సంఘం నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, చందా చంద్రయ్య, స్టాలిన్ రెడ్డి షేక్ సైదా, దేవర వెంకటరెడ్డి, వివిధ కార్మిక సంఘాల నాయకులు మైసయ్య గౌడ్, షేక్ దస్తగిరి, నాగరాజు, వాణి, భాగ్యలత, మంగమ్మ, ఖాజాబీ, గురమ్మ, నాగార్జున, వెంకన్న, రవి, తదితరులు పాల్గొన్నారు.
