Listen to this article

జనం న్యూస్ జూలై 9 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్‌లో గల కమల ప్రసన్న నగర్ కాలనీలో రూ. ఇరవై ఐదు లక్షల వ్యయంతో జరుగుతున్న సిసి రోడ్ పనులను కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు పర్యవేక్షించారు. రోడ్డు పనుల నాణ్యతను కాపాడుతూ, వీలైనంత త్వరగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో ఏ ఈ నిఖిల్ ,వర్క్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి ,కాలనీ ప్రెసిడెంట్ శేఖర్ ,రాము ,బండప్ప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు