

జనం న్యూస్ జులై 09 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
ఆసిఫాబాద్ మండల కేంద్రం లోని ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో ఈరోజు ఆసిఫాబాద్ షీ టీమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం సభ్యులు మాట్లాడుతూ…
విద్యార్థినులు కు ఈవ్ టీజింగ్,సోషల్ మీడియా వేధింపులు, మహిళల అక్రమ రవాణా, బాల్యవివాహాలు, బాల కార్మికులు , గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సైబర్ క్రైమ్స్, వంటి వాటిపై షీ టీం సభ్యులు స్వప్న,రజని,దినేష్ లు వివరించారు.ముఖ్యఅతిథిగా ఎస్సై సతీష్ పాల్గొని మహిళలు విద్యార్థులు సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్,వాట్సప్,ఇంస్టాగ్రామ్ వినియోగంలో జాగ్రత్తలు వహించాలని ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి పండించిన, సేవించిన,వివరాలు తెలిసినా వెంటనే పోలీసులను సంప్రదించాలని అట్టి వివరాలు తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఎవరైనా మహిళలు విద్యార్థులు పిల్లలు వేధింపులకు గురి అయినట్లయితే, లేదా ఇతర ఎవరైనా వేధింపులకు గురి అయినట్లు తెలిస్తే, గమనిస్తే పోలీసుల సంప్రదించాలని, ఆసిఫాబాద్ షీ టీమ్ నెంబర్ 8712670564, లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సై సతీష్ ఆసిఫాబాద్ టౌన్, పాఠశాల హెడ్మాస్టర్ కే. కర్నూ , పాఠశాల అధ్యాపకులు షీ టీం సిబ్బంది స్వప్న రజిని దినేష్ పాల్గొన్నారు.