Listen to this article

జనం న్యూస్ జూలై 09:నిజామాబాద్ జిల్లా

ఏర్గట్లమండలంలోని ఏ గ్రామములో నైనా సరే దమ్ము చక్రలు కలిగిన కేజివిల్ ట్రాక్టర్లు రోడ్డు మీద కనబడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై పడాలరాజేశ్వర్ అన్నారు.ఏర్గట్ల మండలకేంద్రంలోని రైతు వేదిక భవనంలోఎనిమిది గ్రామాలకు చెందిన ట్రాక్టర్ యాజమానులతో బుధవారం సమావేశం నిర్వహించి అవగాహన సదస్సు నిర్వహించారు..ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ..పొలాల్లోకి తీసుకెళ్ళే దమ్ము చక్రాలు కల్గిన కేజివిల్ ట్రాక్టర్లు ఏ గ్రామంలోనైనా రోడ్ల పైన తిప్పొద్దని, దమ్ము చక్రలు కేజివిల్ ట్రాక్టర్ లతో రోడ్డులు పాడాయి పోతాయని, దీనితో రోడ్డు పైన ప్రయాణం చేసే ప్రయాణికులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఎస్సై అన్నారు. దమ్ము చక్రలు కలిగిన ట్రాక్టర్ లను షిఫ్టింగ్ వాహనం పై పొలాల్లోకి తీసుకెళ్లాలని ట్రాక్టర్ యజమానులకు సూచించారు.ఈ కార్యక్రమం లో కానిస్టేబుల్ లు రఘువీర్, శ్రీధర్, ట్రాక్టర్ యజమానులు, తదితరులు, పాల్గొన్నారు.