Listen to this article

జనం న్యూస్ 10 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

దేశవ్యాప్త సమ్మెలో భాగంగా విజయనగరం AIFTU, విజయదుర్గ ఆటో వర్కర్స్‌ యూనియన్‌ విజయనగరంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రకాశ్‌ పార్క్‌ నుంచి కన్యకా పరమేశ్వరి కోవెల మీదుగా స్టేట్‌ బ్యాంక్‌ మెయిన్‌ బ్రాంచ్‌ వరకు ర్యాలీ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండకడుతూ ముందుకు నినాదాలు చేశారు. ర్యాలీలో AIFTU నాయకులు రెడ్డి నారాయణరావు, అప్పల రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.