

లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గోవింద్ నాయక్, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు ఎరన్ పల్లి శ్రీనివాస్.
జనం న్యూస్ జులై 10 వికారాబాద్ జిల్లా రిపోర్టర్
వికారాబాద్ జిల్లా,పరిగి నియోజకవర్గం విజేత ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం ఇద్దరు కవల పిల్లలను అబార్షన్ చేసి హత్య చేయడం జరిగింది. దీనిని గౌరవ జిల్లా కలెక్టర్,గౌరవ డి ఎం హెచ్ ఓ బృణ హత్య ,లింగ నిర్ధారణ (1994) చట్టాన్ని అనుసరించి కేసును సుమోటోగా స్వీకరించి విజేత ఆసుపత్రి యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఆసుపత్రి మరియు డాక్టర్ యొక్క లైసెన్సులను వెంటనే రద్దు చేసి ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,పేద గర్భిణీ స్త్రీలకు మొదటి నెల నుండి 9వ నెల వరకు మా దగ్గరే చూయించుకుంటే సాధారణ కాన్పులు చేస్తామని లక్షల ప్యాకేజీలు మాట్లాడుకుని తీరా డెలివరీ సమయానికి సమయానికి ఏదో ఒక సాకు చెప్పి పేషంట్లను భయభ్రాంతులకు గురిచేసి సాధారణ కాన్పు కాదని సిజరిన్ చేస్తూ లక్షల డబ్బులు వసూలు చేస్తూ పేద గర్భిణీ స్త్రీల కుటుంబాలను అప్పుల పాలు చేసి పలు రకాలుగా ఇబ్బందులు గురిచేస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల ఆగడాలను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తా ఉన్నాo! లేనియెడల ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జిల్లా,రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం! ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం దోమ మండల అధ్యక్షుడు సత్తయ్య, వ్యవసాయ కార్మిక సంఘం పరిగి తాలూకా కన్వీనర్ హబీబ్ తదితరులు పాల్గొన్నారు.
