Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 10 రిపోర్టర్ సలికినీడి నాగు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించడంలో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని 34 వార్డు పోలిరెడ్డి పాలెం నందు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వార్డు కౌన్సిలర్ జంగా సుజాత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్య పట్ల విద్యార్థుల పట్ల పాఠశాలల పట్ల అత్యంత శ్రద్ధ కనపరుస్తున్నారని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలు అందించే సౌకర్యాలు తల్లిదండ్రులకు వివరించడం జరిగింది ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద 15వేల రూపాయలు ఆర్థిక సహాయం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ షూస్ బెల్ట్ సాక్స్ బ్యాగ్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన చేయడం జరుగుతుంది. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి స్మార్ట్ టీవీల ద్వారా డిజిటల్ పాఠ్యాంశాలను బోధించడం జరుగుతుంది.సుశిక్షితులయిన, అత్యున్నత శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే విద్యాబోధన జరపడం జరుగుతుంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఐదు రోజులు కోడిగుడ్డు మూడు రోజులు చిక్కి మూడు రోజులు రాగి జావా ప్రతిరోజు ప్రత్యేక మెనుతో అత్యంత పోషక విలువలు కలిగిన భోజనం అందించడం జరుగుతుంది కావున విద్యార్థుల విద్యార్థులను మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరడం జరిగింది ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించుకోవడంలో భాగంగా తల్లిదండ్రులు సామాజిక వేత్తలు సహకరించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులను పాఠశాలకు ఆహ్వానించి విద్యార్థులు చదువుతున్న తరగతి గదిలో ఉపాధ్యాయులు విద్యార్థులతో వారి విద్యా ప్రగతిని చర్చించడం జరిగింది అనంతరం పాఠశాలలో కల్పిస్తున్న వస్తువులు కల్పన వాటి గురించి చర్చించడం జరిగింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు గురించి, పాఠశాల పరిసర ప్రాంతాల పరిశుభ్రత విద్యార్థులు వ్యక్తిగత శ్రద్ధ. విద్యార్థుల ఆరోగ్యం పై వ్యక్తిగత శ్రద్ధ వహించాలని తెలియజేయడం జరిగింది. తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది మాజీ కౌన్సిలర్ టి అంజిరెడ్డి పెద్దలు టి బలరాం రెడ్డి నా గురువల్లి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జే హైమావతి, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పి.శైలజ,పోటు శ్రీనివాసరావు, కే అరుణ జి ఆదిలక్ష్మి,సిహెచ్ నవ్య శ్రీ పేరెంట్స్ కమిటీ సభ్యులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.