Listen to this article

సాయిబాబాను దర్శించుకున్న ఎమ్మెల్యే విజయ్ కుమార్

జనం న్యూస్,జూలై10,అచ్యుతాపురం:


గురు పౌర్ణమి సందర్భంగా అచ్యుతాపురం లోని ఉన్న శ్రీ శిరిడి సాయిబాబా స్వామి వారిని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దర్శించుకున్నారు.ఆలయ కమిటీ వారు ఆహ్వానించి వేద పండితులతో ఆశీర్వాదం స్వీకరించి అర్చకులుచే ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మంలో తల్లి, తండ్రి తర్వాత అత్యంత గౌరవనీయ స్థానం గురువుకే దక్కుతుందని, తల్లిదండ్రుల వద్ద మనం కొన్ని విషయాలే నేర్చుకుంటాం.. కానీ, గురువుల వద్ద నుంచి అనేక విషయాలను నేర్చుకుంటామని,అందుకే గురువును.. ‘గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః’ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,యువకులు, పెద్దలు,కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.