

జనంన్యూస్. 10. సిరికొండ.
నిజామాబాదు రూరల్ నియోజకవర్గం సిరికొండ మండల పోలీస్ స్టేషన్ కు నూతనంగా బాధ్యతలు స్వికరించిన ఎస్సై జె. రామకృష్ణ ను ఇరోజు రాజ్యాంగ నిర్మాత డా”బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటాన్ని అందిస్తూ స్వాగతం పలికిన ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మొట్టల దీపక్ మాదిగ, ధర్పల్లి మండల ఇంచార్జ్ నక్క రాజేందర్ మాదిగ ఈ సందర్బంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేస్తున్న సామాజిక న్యాయ పోరాటాల గురించి మరియు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి పోలీస్ వ్యవస్థ అందిస్తున్న సహాయ సహకారాలను గుర్తు చేస్తూ ప్రజలకు చట్టపరమైన సామాజిక న్యాయం అందించాలని SI జే రామకృష్ణ ను కోరడమైనది. మరియు ఎస్సైని సత్కరించిన వారిలో పందిమడుగు మాజీ సర్పంచ్ సర్దార్ భాగ్యలక్ష్మి గంగా నరసయ్య. సుక్క నడిపి నరసయ్య. ధర్మపురి సుంక పక్క రాజన్న తదితరులు ఎస్సైని కలిసిన వారిలో ఉన్నారు.
