

జనం న్యూస్ జూలై 10 (నడిగూడెం)
మండలంలోని రామాపురంలో త్రిపురవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా మంజూరైన పౌష్టికాహార కిట్టును రామాపురం,మాజీ సర్పంచ్, నడిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూత్కూరి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు అలవాల రామారావు , సింగల్ విండో డైరెక్టర్ తిప్పిరెడ్డి చిన్నకోటిరెడ్డి తో కలిసి, పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ పప్పుల అన్నపూర్ణ, అంగన్వాడి టీచర్ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.