

జనం న్యూస్, జూలై10,అచ్యుతాపురం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో మార్పుల్ని స్వీకరిస్తూ.. మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమాన్ని అచ్యుతాపురం మండలం లోని పూడిమడక పంచాయతీ కడపాలెం గ్రామంలో గల ఎంపీపీ పాఠశాల నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ చేపల సుహాసిని,రమణ, ఎంపీటీసీ అరుణ అప్పలనాయుడు,ఎస్ఎంసి చైర్మన్ సూరాడ మహేష్ బాబు, ఉప ఛైర్మన్ దోని ధోని,విట్నస్ గా మరిడమ్మ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాభివృద్ధికి మరియు పాఠశాల అభివృద్ధి కొరకు చేయవలసిన కృషి గురించి చర్చించడం జరిగింది అని, తల్లికి వందనము కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వారి యొక్క తల్లుల పాదాలకు పుష్పార్చన చేయడం జరిగిందని
మ్యూజికల్ చైర్,రాంగోలి, లెమన్ మరియు స్పూన్ గేమ్స్ ఆడించి గెలిచిన వారికి బహామతులను అందజేశారని అలాగే విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమంను నిర్వహించడమైనదని, వచ్చిన వారందరకి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనము స్వీకరించుట జరిగినదని సమావేశానికి వచ్చిన తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జెవి రత్నం, ఉపాధ్యాయులు అప్పలరాజు,అచ్యుతరావు,సౌజన్య,అరుణ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.