

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జులై 10:
మండలంలోని పలు కంకర మిల్లులను గురువారం ఆర్డిఓ రాజేందర్ గౌడ్, మైనింగ్ ఏడి సాయినాథ్ తనిఖీ చేశారు. గార్లఒడ్డు, జన్నారం, హిమామ్ నగర్ గ్రామాలలోని కంకర మిల్లులను తనిఖీ చేశారు. కంకర మిల్లుల అనుమతులకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించారు. అనుమతులు ఉన్న కంకర మిల్లులు మాత్రమే మెటీరియల్ ను తోలుకోవాలని, అనుమతులు లేనివి ఎట్టి పరిస్థితులలోనూ తోల వద్దని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సిహెచ్ శేషగిరిరావు, ఆర్ఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.