Listen to this article

జనంన్యూస్. 11. నిజామాబాదు. టౌన్.

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్.

నిజామాబాదు. వినాయక్ నగర్ లక్ష్మి సిల్క్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాలక్ష్మి అమ్మ వారి బోనాల పండుగ ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా సమాజంలో సౌభాగ్యం, శాంతి, సమృద్ధిని కలగజేయాలనే భావనతో గ్రామదేవతకు బోనాలు చెల్లించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశడమాసంలో ప్రజలందరు భక్తి శ్రద్దలతో బోనం చేసి అమ్మవారిని కోలిస్తే స్వయంగా అమ్మవారే తమ ఇంటికి వస్తుందని భక్తులందరు నమ్మకంగా భావిస్తారని అన్నారు. అమ్మ దయతో సకాలంలో వర్షాలు కురిసి రైతన్నలు అధిక పంటలు పండించాలని పిల్లజల్లా, గొడ్డు గోదా అన్నింటిని కాపాడాలని అమ్మవారిని పూజించడం జరుగుతుందని అన్నారు. నగర ప్రజలందరు అష్టఐశ్వర్యాలతో, సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలియజేసారు. మహాలక్ష్మినగర్ వాసులు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా పండుగను నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. ఊరేగింపులో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని, డప్పుల శబ్దంతో, పాటలతో, కోలాటాలతో ప్రదర్శనలు ఇస్తూ సంబరాలను మరింత భక్తిమయంగా, శోభాయమానంగా మార్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ పంచారెడ్డి లావణ్య & లింగం, లక్ష్మి సిల్క్స్ షాపింగ్ మాల్ అధినేత శీతల్ గారు మరియు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మినారాయణ,పార్షి రాజు, అల్లాడి రాజు, భోగ గంగాధర్, ఆనంద్,శివునూరి భాస్కర్,సతీష్ తదితరులు పాల్గొన్నారు.