

బిచ్కుంద జులై 11 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం పెద్ద దేవడ గ్రామ శివారులోని బిచ్కుంద టు బాన్సువాడ రోడ్డు బ్రిడ్జి వద్ద ఈరోజు పుట్టిన ఒక ఆడపిల్ల( నవజాత శిశువు) ను రోడ్డు పక్కన పడవేయగా బిచ్కుంద పోలీస్ వారు చూసి వెంటనే పుల్కల్ PHC కి తరలించి మరియు మెరుగైన చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలించడమైనది వెంటనే ఇట్టి సమాచారం సిడిపిఓ గారికి చెప్పి బేబీ సంరక్షణ అర్థం వారికి అప్పగించడమైనది