

జనం న్యూస్ జూలై 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
జేఎన్టీయూ ఆడిటోరియం లో వర్మ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సరస్వతి లిటరరీ ఫెస్ట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ పాఠశాలల నుంచి వచ్చి ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులును అభినందిస్తూ… చిన్నప్పటి నుంచే అన్ని రంగాల్లో కూడా విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా ఇటువంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని వర్మ ఫౌండేషన్ వారిని అభినందించారు… ఇలాంటి సాంస్కృతిక, కళ, సాహిత్య రాజకీయ మొదలగు అన్ని రంగాల్లో పోటీ నిర్వహించడం ద్వారా చిన్నారుల్లో దాగున్న నైపుణ్యాన్ని కూడా వెలికి తీసి వారు భవిష్యత్తులో ఎటువంటి ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారో గుర్తించే వీలు కూడా తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ఉంటుందని… ఏ రంగంలో అయితే విద్యార్థులు ప్రతిభ చూపుతారు.. వారిని ఆ రంగంలో ప్రోత్సహించడం ద్వారా వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుని సమాజానికి వారి వంతు కృషి చేయడం జరుగుతుందని అన్నారు ..ఈ దిశగా తల్లిదండ్రులు కూడా ఆలోచించాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎస్. బాలకృష్ణ రాజు, శ్యామలరాజు, వాసురాజు, సుబ్బరాజు, భీమరాజు.. నలంద స్కూల్స్ చైర్మన్ శ్రీనివాసరాజు.. సినీ దర్శకులు కే .చంద్ర, సాయి రాజేష్ తదితరులు పాల్గొన్నారు…
