Listen to this article

జనం న్యూస్ జులై 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ భూదేవి హిల్స్ కాలనీలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సేవెళ్ల మహేందర్ శేర్లింగంపల్లి కంటెస్టడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ విచ్చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్టుగా భావించాలని అన్నారు. కుమార్ యాదవ్ జన్మదినం రోజు సేవా కార్యక్రమాలు చేయడం నిజంగా గొప్ప విషయమని అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్లో ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలుస్తూ నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమై పనిచేయడం సంతోషకరమన్నారు. యువత సమాజ సేవ చేసే కార్యక్రమాలలో ముందుండాలని అన్నారు. ప్రజాసేవ చేస్తే దేశసేవ చేసినట్టుగా భావించాలని దేశంలో ఉన్న ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చిన యువత ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు వివిధ కాలనీల అసోసియేషన్ అధ్యక్షులు, కమిటీ సభ్యులు శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని కుమార్ యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు.