Listen to this article

జగజంపుల తిరుపతి, పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి

జనం న్యూస్ జనవరి 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం జిల్లా కౌటాల మండలంలోనీ ప్రభుత్వం జూనియర్ కళాశాల లో విలీనం సభ కరపత్రాలను ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా *పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులు లెనిన్ మాట్లాడుతూ.ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ యు ఉస్మానియా యూనివర్సిటీలో పురుడోసుకొని నేడు దేశవ్యాప్తంగా పీడిత విద్యార్థుల పక్షాన పోరాడుతుంది. , 50 సంవత్సరాల సుదీర్ఘ పోరాట వారసత్వం పిడిఎస్ యు సొంతం. రాజ్యం, పాలక ప్రభుత్వాలు ఎంతటి నిర్బంధం ప్రయోగించినా ఎప్పటికప్పుడు వాటికి సవాలు విసురుతు తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. దేశ విప్లవ విద్యార్థి ఉద్యమానికి దిక్సూచిగా నిలిచింది. జార్జిరెడ్డి త్యాగం, జంపాల చంద్రశేఖర ప్రసాద్ అమరత్వం అమరవీరుల అంకితభావం అశేషమైన పీడిత విద్యార్థి లోకాన్ని నేటికీ కదిలిస్తూనే ఉంది. వీరి ఆశయ సాధనలో నిన్నటి వరకు విడివిడిగా . ప్రగతిశీల విద్యార్థుల ఐక్యత నేడు అనివార్యంగా ముందుకోస్తుంది. ఈ చారిత్రక సందర్భంలో రెండు విప్లవ విద్యార్థి స్రవంతులు ఐక్యమవుతున్నాయి. పిడిఎస్ యు దీని వరకే పరిమితం కాకుండా దేశంలో ఉన్న మరిన్ని విప్లవ విద్యార్థి సంఘాలతో భవిష్యత్తులో ఐక్యమవ్వడానికి ప్రయత్నిస్తుంది. దీని ద్వారా మరింత బలమైన విద్యార్థి ఉద్యమాన్ని నిర్మిస్తుంది. సమరశీల పోరాటాలను చేస్తుంది. ఈ ఐక్యతను విద్యార్థులు, మేధావులు, విద్యావేత్తలు అన్ని వర్గాల ప్రజలు సాదరంగా ఆహ్వానించి జనవరి 28 ఖమ్మంలో జరిగే విలీన సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు మండల నాయకులు గోలేటి శ్రీకాంత్, నందకిషోర్, హరిదాస్ తదితరులు పాల్గొన్నారు.