

లగడపాటి రమేష్ చందు లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం అధ్యక్షులు
జనం న్యూస్ 11జూలై ( కొత్తగూడెం నియోజకవర్గం )
ఈరోజు లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీనగర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఇందిరానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం ఆధ్వర్యంలో పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి
గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కృష్ణయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రెండు మొక్కల నాటి వాటిని సంరక్షించాలని పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని అభినందించారు. రానున్న రోజుల్లో ఇదేవిధంగా సేవా కార్యక్రమాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు తిరుపతమ్మ, లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం కోశాధికారి శ్రీశైలం జయ కుమార్, సీనియర్ లయన్ మెంబర్ కూర శ్రీధర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు.