

జనం న్యూస్- జూలై 11 – నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ నాగార్జునసాగర్ పరిధిలోని నేషనల్ హైవే పై బ్లాక్ స్పాట్లను గుర్తించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను పర్యవేక్షించారు, రోడ్డు ప్రమాదాలు నివారించడానికి రోడ్డు వెడల్పు, సూచిక బోర్డులు ఏర్పాటు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హైవే అథారిటీ డి ఈ మురళీకృష్ణ , డి టి ఆర్ బి( సి ఐ) అంజయ్య , ఎలక్ట్రికల్ ఎస్సీ ఏ గీత, ఏ ఈ కే శేఖర్, ఫారెస్ట్ డి ఎఫ్ ఓ రాఘవరావు, నాగార్జునసాగర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సతీష్, హాలియా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కల్పన, నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శీను నాయక్, విజయపురి టౌన్ ఎస్సై జి ముత్తయ్య వారి సిబ్బంది పాల్గొన్నారు.