Listen to this article

జనం న్యూస్ జూలై 12

విజయవాడ వన్ టౌన్,భావన్నారాయణ వీధి, రాములవారిగుడి దగ్గర ఉన్న, న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్, గురు పౌర్ణమి సందర్భంగా మరొక అత్యుత్తమ పురస్కారమైన స్వామి వివేకానంద ఆదర్శ రత్న సమ్మాన్ అవార్డును సొంతం చేసుకున్నారు. దానితో సంస్థ విద్యార్థినీ విద్యార్థులు సభ్యులు సంస్థ సేవలకు మంచి గుర్తింపు లభిస్తున్నందుకు హర్షధ్వానాల మధ్య స్వీట్లు తినిపించుకున్నారు. సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి సాయి వినయ్ కుమార్ 16 సంవత్సరాల క్రితం తన ముగ్గురు మిత్రులతో కలిసి రోజుకు రూపాయి చొప్పున నెలకు ముప్పై రూపాయలను తను హోంగార్డుగా ఉద్యోగం చేస్తూ వచ్చిన జీతంలో తీసి ఆడబ్బుతో సంస్థను మొదలుపెట్టారు. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడుతూ, ఎంతోమంది అనాధలకు పేదలకు,వృద్ధులకు,దివ్యాంగులకు, క్షతగాత్రులకు,హిజ్రాలకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు,భోజనాలు అందిస్తూ దిన దిన ప్రవర్ధమానమై సుమారు లక్షమందికి ఉచిత భోజనం అందించారు ఇవే కాకుండా ఈ సంస్థ ఉచిత విద్యతో పాటు అన్ని రకాల వ్యాధులకు వైద్యసహాయాన్ని పేదపిల్లలకు, వృద్ధులకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అందించడమే కాకుండా వారికి తగిన పౌష్టికాహారాన్ని అందచేస్తూ ప్రత్యేక అవగాహన సదస్సులు పెట్టి అవగాహన కల్పిస్తూ చిల్డ్రన్స్ డే రోజున చిన్నారి మనసు అనే కార్యక్రమంతో మదర్స్ డే రోజున అమ్మ మనసు అనే కార్యక్రమంతో మరియు ఆత్మీయ చేయుత వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థిని విద్యార్థులకు బాల్య వివాహాలు, బాల కార్మికుల నిర్మూలన,ప్రజలను నిర్వీర్యం చేస్తున్న మత్తు పదార్థాలపై వ్యతిరేకంగా పోరాడుతూ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ,మన భరతజాతి సంస్కృతి సాంప్రదాయాలు ఆహారపు అలవాట్లపై సైతం సభలు నిర్వహిస్తూ, కులమతాలకు అతీతంగా కార్యక్రమాలను చేస్తూ, విద్యార్థులలో ఉన్న ప్రతిభాపాటవాలను వెతికి తీస్తూ చాటుతూ గౌరవనీయులైన హైకోర్టు జడ్జ్ కృపాసాగర్, రిటైర్డ్ జిల్లా కోర్టు జడ్జి దాసరి బాలకృష్ణ, డాక్టర్ సమరం వంటి ఎంతోమంది ప్రముఖులతో అభినందనలు అందుకుంటూ ప్రశంసలు పొందుతున్నారు. గత ప్రభుత్వ వైద్య శాఖ నుండి మా సంస్థ అందించిన సేవలకు ప్రత్యేక ప్రశంసలందుకుంది .రోటరీ క్లబ్, అన్నసంతర్పణ సేవా సమితి వంటి అనేక ఎన్జీవో సంస్థల నుండి ఒకేషనల్ ఎక్స్లెన్స్ అవార్డు, ఉగాది పురస్కారం, బుడమేరు వారియర్స్, నెల్సన్ మండేలా ఇన్స్పైర్ అవార్డు 2025, ప్రస్తుతం స్వామి వివేకానంద ఆదర్శ రత్న సమ్మాన్ అవార్డు ఉత్తరప్రదేశ్ లోని వర్తి వెల్నెస్ సంస్థ మేము చేస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా అవార్డులు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా గురువులు, పోలీస్, మీడియా, డాక్టర్స్, న్యాయవాదులు, రాజకీయ ప్రముఖులు, విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లితండ్రులు సంస్థకు వారి ఆశీర్వాదాలతో పాటు శుభాకాంక్షలు తెలియపరచారు.