Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 12 రిపోర్టర్ సలికినీడి నాగు

AIYF రాష్ట్ర సహాయ కార్యదర్శి CPI సుభాని

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం నారా చంద్రబాబునాయుడు గారు వెంటనే నెరవేర్చాలనీ,నిరుద్యోగ భృతి, ఉద్యోగం యువతకు హక్కు ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని AIYF రాష్ట్ర సహాయ కార్యదర్శి CPI సుభాని డిమాండు చేశారు.సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్‌లో యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనీ,నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతిని వెంటనే ఇవ్వాలని,రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలనీ అన్నారు.అమరావతిని జీవనాధారంగా గుర్తించి 26 జిల్లాల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనీ డిమాండు చేశారు.ఈ సందర్భంగా ఈ నెల 14 వ తేదీ పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు నిరసన కార్యక్రమానికి అధిక సంఖ్యలో యువత పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో AIYF ఏరియా కార్యదర్శి కే.మల్లికార్జున్,లక్ష్మీపతి,వెంకటేష్, అనిల్ కుమార్ పాల్గొన్నారు.