Listen to this article

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జనవరి :25-01-2025:- ఏన్కూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఓటు ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. ప్రార్థన సమయంలో ఓటరు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం విద్యార్థులకు ముగ్గుల పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కే సైదయ్య, విద్యా కమిటీ చైర్మన్ వెంకటలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.