Listen to this article

జనం న్యూస్ 14జూలై ( కొత్తగూడెం నియోజకవర్గం )

తరతరాలుగా అన్ని రంగాలలో అన్యాయానికి గురవుతున్న బీసీల గురించి బడుగు బలహీన వర్గాల గురించి గొంతేత్తుతున్న తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి చేసి మల్లన్నను హత్య చేయడం ద్వారా భవిష్యత్తులో బీసీల గురించి మాట్లాడే వాళ్లు ఎవరైనా ఇదే గతే మీకు పడుతుందనే హెచ్చరిక చేయడానికి చేసిన అగ్రకుల అహంకార కుట్రనే నిన్న మల్లన్న పై జరిగిన దుర్మార్గం.అధికారంలో ఉన్న పది సంవత్సరాలు బీసీల గురించి ఏమి చేయకుండా ,స్థానిక సంస్థలలో ఉన్న రిజర్వేషన్ శాతాన్ని 33 నుంచి 23 కి తగ్గించిన అగ్రకుల పార్టీ నాయకురాలు అయినా కలవకుంట్ల కవిత ఇవాళ బీసీల గురించి మాట్లాడటం ఒక డ్రామా అని,బీసీల గురించి మాట్లాడే అర్హత ఆమెకు లేదు అనే కోణంలో మీకు మాకు కంచం పొత్తు లేదు _మంచం పొత్తు లేదు అనేటువంటి తెలంగాణ సామెతని ఉదాహరించడమే పెద్ద నేరంగా ఘోరంగా గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న సామెత లాగా కవిత తన అగ్రకుల అహంకారాన్ని ప్రదర్శించడం అత్యంత దుర్మార్గం .అసలు రాజకీయాలలో సంస్కారం లేని భాషకు శ్రీకారం చుట్టిందే తమ కుటుంబ సభ్యులు అనే విషయాన్ని కవిత మరిచిపోవడం శోచనీయం .కాబట్టి సమాజం మొత్తం కూడా జరిగిన పరిస్థితిని అర్థం చేసుకొని బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారంలో భాగస్వాములను చేయటానికి కలిసి రావాలని బీసీలు తమ వర్గాల పట్ల జరుగుతున్న దుర్మార్గాలను ఐక్యంగా ఎదుర్కోవటానికి సిద్ధం కావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఒకవేళ మల్లన్న ఏదన్న తప్పు మాట్లాడి ఉంటే దానికి సమాధానంగా చెప్పడానికి మీడియా ఉంది .పోలీసులు ఉన్నారు. న్యాయస్థానాలు ఉన్నాయి .ఇవన్నీ వదిలేసి రాజ్యాంగాన్ని గంగలో కలిపి తమ ఆధిపత్యానికి ప్రమాదంగా బీసీలు తయారవుతున్నారన్న బాధతో దుర్మార్గంగా ఆఫీస్ పై దాడి చేసి హత్యా ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యంలో అత్యంత దుర్మార్గం .దీనిని సభ్య సమాజం ఖండించవలసిందిగా కోరుతున్నాము.