

జనం న్యూస్,జూలై14,అచ్యుతాపురం:
తమతో కలిసి చదువుకున్న బాల్య మిత్రురాలు చోడపల్లిలో నివాసం ఉంటున్న మైలపల్లి ఉషారాణి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడి, రెండు కాళ్లు విరిగిపోయాయని సమాచారం తెలుసుకున్న అచ్యుతాపురం జడ్పీ హై స్కూల్లో 2002-03 పదవ తరగతి బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు తమ తోటి స్నేహితురాలు ఇంటికి వెళ్లి అమెను పరామర్శించి రూ.60 వేలు ఆర్ధిక సాయంగా అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. నా తోటి చదువుకున్న బాల్య మిత్రులు చేసిన ఆర్ధిక సాయం మర్చిపోలేనని ఉషారాణి తెలిపారు. ఈ సహాయ కార్యక్రమంలో డి.రవితేజ,పవన్ విజయ్ ఉమా,లక్ష్మి, లోవలక్ష్మి కె.సోమనాయుడు ఎస్.వెంకన్న,పి.జూనియర్ నాగేశ్వరరావు, కే.వెంకీనాయుడు, ఆర్.నాయుడుబాబు, శ్రీధర్, కె నాయుడు బాబు పోలీస్ ఎక్సైజ్ నాయుడు బాబు,ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.