

జనం న్యూస్ 15జులై పెగడపల్లి ప్రతినిధి.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నీరటి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిన్న జరిగిన బిసి బిడ్డ అయినా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న పై దాడి హేమమైన చర్య అని ఇట్లాంటి దాడులు మున్ముందు పునరావృతం కాకుండా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు నేరటి రాజ్ కుమార్ ప్రధాన కార్యదర్శి, గర్వంద శేఖర్ గౌడ్ ఉపాధ్యక్షులు చెట్ల రాజు పుల్కం జలపతి చిన్నం తిరుపతి కార్యదర్శి గొల్లపల్లి రామచంద్రం బీసీ సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి కంబాల తిరుపతి తోడేటి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.