Listen to this article

జనం న్యూస్ జూలై 15(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన హామీలను అమలు చేయలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులకు బచ్చల కూర స్వరాజ్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గం లోని తిరుమలగిరి లో ఏర్పాటు చేసిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా మండలంలో సిపిఎం పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేయడాన్ని ప్రజాతంత్ర వాదులు ఖండించాలని కోరుతూ. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా రాష్ట్రం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను పూర్తిగా అమలు చేయటంలో విపులమైందని అన్నారు.కొత్త రేషన్ కార్డుల పంపిణీ నిరంతరం కొనసాగించాలని దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వాలని.ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేదలందరికీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినారు.అరెస్టు చేయబడిన వారిలో సిపిఎం పార్టీ మండల కమిటీ సీనియర్ నాయకులు చందా చంద్రయ్య,బోళ్ళ కృష్ణారెడ్డి,దేశి రెడ్డి స్టాలిన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.