

జనం న్యూస్:14 జూలై సోమవారం: సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి వై.రమేష్;
సిద్దిపేటలోని బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ నందు అడ్మిషన్ల ప్రక్రియ ఉపాధి అవకాశాలు అనే అంశంపై స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డా. శ్రద్ధానందం అధ్యక్షతన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్టర్ ఎల్ విజయ కృష్ణా రెడ్డి (ఎల్. వి. కె రెడ్ది) మరియు స్టూడెంట్ సర్వీస్ బ్రాంచ్ డైరెక్టర్ వై. వెంకటేశ్వర్లు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా రిజిస్టర్ ప్రొఫెసర్ ఎల్. వి.కే రెడ్డి గారు మాట్లాడుతూ చదువు ద్వారానే అనే సమాజం వికాసం చెందుతుందని. సమాజంలోని పేద బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యను దగ్గర చేసిందని పేర్కొన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీలు పీజీలు పూర్తి చేసి ప్రస్తుతం వివిధ రంగాలలో సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. 2025 26 సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ పీజీ అడ్మిషన్ల ప్రక్రియ మొదలైందని కాబట్టి అడ్మిషన్లు వేగవంతం చేయాలని కౌన్సిలర్లకు పిలుపునిచ్చారు. స్టూడెంట్ సర్వీస్ బ్రాంచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వై. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కొన్ని ప్రైవేటు కంపెనీలతో విద్యార్థులకు శిక్షణ -ఉపాధి ని అందించే నిమిత్తం ఒప్పందం చేసుకున్నదని కాబట్టి విద్యార్థులు అందరూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లు పొంది వివిధ కంపెనీలు ఇచ్చే శిక్షణను తీసుకొని ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉన్నాయని వీటిని అందిపుచ్చుకోవాలని సూచించారు.. కార్యక్రమంలో డా.బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కి 2025-26 విద్యా సం..సంబంధించిన అడ్మిషన్ల పోస్టర్ను విడుదల చేశారు. స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డా. ఎం. శ్రద్ధానందం మాట్లాడుతూ రాబోయే ఆగస్టు నెల లో స్టడీ సెంటర్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతుందని ఇట్టి కార్యక్రమానికి స్టడీ సెంటర్ లో చదివిన విద్యార్థులు అందరూ హాజరు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కౌన్సిలర్లు ఏం బాలయ్య, జి బాలకృష్ణ డా. ఎస్ సువర్ణ దేవి, మరియు ఇతర కౌన్సిలర్లు పాల్గొన్నారు