Listen to this article

జనం న్యూస్ జులై 14 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో


కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ లోని గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి రమాదేవి గకి తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు డైలీ వేజీ మరియు ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఐదు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి స్పందిస్తూ గిరిజన శాఖ జిల్లా అధికారి రమాదేవి పెండింగ్లో ఉన్న వేతనాలు త్వరలోనే చెల్లింపులు చేస్తానని హామీ ఇచ్చారు గతంలో లాగా మ్యానువల్ గా కాకుండా వర్కర్ల పేర్లు ఆన్లైన్ లో కి మార్చారని వేతనాలు పడుటకు కొద్దిపాటి సమయం పడుతుందని దీనికి వర్కర్లు అనుకూలంగా స్పందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు మరియు డైలీవేజి ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు టేకం ప్రభాకర్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు అరిగిన కోటయ్య మరియు ఇతరులు పాల్గొన్నారు