Listen to this article

జనం న్యూస్ 15 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

తనను గోవా గవర్నర్‌గా నియమించడం పట్ల అశోక్‌ గజపతిరాజు హర్షం వ్యక్తం చేశారు. అవకాశాల కోసం తానెప్పుడూ పరిగెత్తలేదని, అవి వచ్చినప్పుడు బాధ్యతగా స్వీకరించానని తెలిపారు. గవర్నర్‌గా తన పేరును సీఎం చంద్రబాబు సిఫార్సు చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ నియామకంతో తెలుగువారి గౌరవాన్ని మరింత పెంచే బాధ్యత తనపై ఉందన్నారు. దేశానికి సేవ చేసే అవకాశం మరోసారి లభించడం ఆనందంగా ఉందని వివరించారు.