

జనం న్యూస్ 15 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
జిల్లా పోలీసు శాఖలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాలతో మృతి చెందిన పి. శ్రీనివాసరావు కుమారుడు బాలాజీని హోంగార్డుగా నియమిస్తూ ౩? వకుల్ జిందాల్ సోమవారం నియామక పత్రం అందజేశారు. హోంగార్డు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఇప్పటికే హోంగార్డుల ఒకరోజు వేతనాన్ని అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో హోం గార్డుల ఇన్ఛార్జ్ రిజర్వ్ ఇన్స్‌స్పెక్టర్ రమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.