Listen to this article

జనం న్యూస్ జనవరి 25 జిల్లా బ్యూరో:- ఇంద్రవెల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో 15వ జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఇట్టి వేడుకల్లో రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు సత్యరాజ్ ఉపారపు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ప్రధాన కూడలిలో పోలీస్ స్టేషన్ నుండి అంజి రోడ్ వరకు ర్యాలీ నిర్వహించి ప్లే కార్డ్స్ ను చేత పట్టుకుని, ఓటు హక్కు గురించి నినాదాలు చేస్తూ అలాగే మానవహారంగా ఏర్పడి ప్రతి ఓటరు తమ ప్రాథమిక హక్కు అయిన ఓటును నిజాయితీగా వేయాలని ప్రతిజ్ఞ చేశారు. సందర్భంగా సత్యరాజ్ మాట్లాడుతూ ప్రతి 18 సంవత్సరాల నిండిన యువతి యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని,ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు విలువ గురించి తెలుసుకొని ఎన్నికలలో ఓటును డబ్బుకు అమ్ముకోకుండా, సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.కార్యక్రమంలో స్థానిక అధికారులు, ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారు.