Listen to this article

జనం న్యూస్. 15జూలై. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫర్.

ఐటిడిఎ పరిధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు త్రాగునీటి సమస్యలు లేకుండా చూడాలని, వసతి సౌకర్యాలు, మరుగుదొడ్లు ఈగలు దోమలు లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. సానుకూలంగా స్పందించిన పిఓ తక్షణమే విచారణ జరిపించి వసతులను మెరుగుపరుస్తామన్నారు. కార్యక్రమంలోఎన్ హెచ్ ఆర్ సి మండల కమిటీ సభ్యులు అడ. సోనేరావ్(జైనూర్), సోయం. సత్పత్ రావు (లింగాపూర్), తోడసం రమేష్ (సిర్పూర్ యు), కనక తిరుపతి (సిర్పూర్ యు) ఉన్నారు.