

జనం న్యూస్ జూలై 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఈరోజు ఉదయం 84 వ వార్డులో వడ్డీలు వీధి చినరాజుపేట ఇంటింటి ప్రచారం చేస్తూ, ఈ సందర్భంగా నాగ జగదీష్ మాట్లాడుతూ ప్రజలు రామరాజ్యం కావాలని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తుంటే, ఆర్థిక నేరస్థుడు జగన్ రెడ్డి పోలీసులను బెదిరిస్తూ, తనలాగే నేరస్తులను ప్రోత్సహిస్తున్నాడని, ఇటువంటి అరాచక శక్తులు ఆంధ్రప్రదేశ్ కు అవసరమా అని నాగ జగదీష్ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బోడి వెంకటరావు, కుప్పిలి జగన్, శ్రీకాకుళం గణపతి గుర్రాల వాసు పండురు సత్యనారాయణ యర్ర సత్యనారాయణ వానపల్లి త్రినాధరావు నెక్కిన నర్సింగరావు పరమేశ్వరరావు వెంకట్రావ్ బూడిద జానకి పండూరి రమణమ్మ మావూరు పద్మ తదితరులు పాల్గొన్నారు.