

జనం న్యూస్ జులై 15, వికారాబాద్ జిల్లా
పరిగి మున్సిపల్ పరిధిలోని కొడంగల్ చౌరస్తా నుండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు వెళ్లే దారి రోడ్డు చినుకు పడితే చిత్తడైపోతున్న రోడ్డు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు వెళ్లే భక్తులకు, ఆ కాలనీవాసులకు మరియు అక్కడనే రెండు పాఠశాలలో ఉండడంతో ఆ స్కూలుకు వెళ్లే విద్యార్థిని విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ కాలనీవాసులు ఎన్ని మార్లు మున్సిపల్ అధికారులకు మొరపెట్టుకున్నా దయదలుచడం లేదని అన్నారు. ఇకనైనా అధికారులు ఆ గుంతలలో కనీసం ఇంత డస్ట్ మొరంతో పూడ్చి కాలనీ వాసులకు, వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెళ్లే భక్తులకు స్కూలు విద్యార్థిని విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుతున్నారు.