Listen to this article

చిలకలూరిపేట:ఇండియన్ రెడ్ క్రాస్ అసోసియేషన్ కార్యవర్గ సర్వ సభ్య సమావేశం ఈ నెల 20వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు స్థానిక తహసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో వున్న రెడ్ క్రాస్ భవన్ లో నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ అధ్యక్షులు, మరియు తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ తెలిపారు. ఈ సమావేశంలో నూతన కమిటీ ఏర్పాటు పై చర్చ వుంటుందన్నారు. అలాగే గతంలో పనిచేసిన కార్యక్రమాల పై సమీక్ష చేయనున్నట్టు వివరించారు. గత కొంత కాలంగా రెడ్ క్రాస్ సేవలు స్థబ్దంగా ఉన్నందున నూతన కమిటీ ఏర్పాటు చేసి సేవలను విస్తృతం చేయనున్నట్టు తహసిల్దార్ తెలిపారు. సభ్యులు వచ్చేటప్పుడు తమ ఐడెంటిటీ కార్డులు తీసుకు రావాలన్నారు. అలాగే నూతనంగా సభ్యులుగా చేరేవారు సభ్యత్వ రుసుము చెల్లించి సభ్యులుగా చేరవచ్చు అన్నారు.