

జనం న్యూస్ 16 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
శక్తి మొబైల్ యాప్ మహిళలకు రక్షణగా ఉంటుందని అదనపు SP సౌమ్యలత అన్నారు. మంగళవారం విజయనగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో విద్యార్థులకు శక్తి మొబైల్ యాప్ పట్ల అవగాహన చేపట్టారు. మొబైల్లో శక్తి యాప్ ఉంటే ఆపద సమయాల్లో రక్షణగా ఉంటుందన్నారు. ఆపద సమయాల్లో SOS బటన్ నొక్కితే క్షణాల్లో పోలీసు బృందం మీరున్న ప్రాంతానికి చేరుకుంటారని చెప్పారు. లక్ష్యంపై దృష్టి పెట్టి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు.