

తాసిల్దార్ వేణుగోపాల్
బిచ్కుంద జూలై 16 జనం న్యూస్
క్రింద చెప్పిన అర్హతలున్న BPL కుటుంబాల నుండి, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) క్రింద ఆర్థిక సహాయం పొందుటకు దరఖాస్తులను ఆహ్వానించడమైనది. ఆర్థికంగా బలహీనమైన కుటుంబంలో ప్రధాన పోషణ కర్త వ్యక్తి మృతిచెందినప్పుడు, ఆ కుటుంబానికి ఒక్కసారిగా ఆర్థిక సహాయం అందించడం పథక లక్ష్యం. కుటుంబానికి ₹20,000/- ఆర్థిక సహాయం అందించబడుతుంది. మృతుని వయస్సు 18 నుండి 59 సంవత్సరాల మధ్య ఉండాలి మరియు ఆయన మృతి 12th April 2017 తర్వాత జరిగినవారై ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో మిగిలిన కుటుంబ ప్రధాన పోషణ కర్త దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ప్రమాణాలు ప్రకారం తప్పనిసరిగా వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. కుటుంబ ప్రధాన పోషణ కర్త మృతి చెందిన కుటుంబాలకే పథకం వర్తిస్తుంది.గమనిక: ఇప్పటికే ఆమ్ ఆద్మీ బీమా యోజన / జనశ్రీ బీమా యోజన / అపద్బంధు పథకం ద్వారా సహాయం పొందిన కుటుంబాలు ఈ పథకానికి అర్హులుకావు.దరఖాస్తుతో పాటు ఈ క్రింది పత్రాలు సమర్పించాలి:మృతుని మరణ ధృవీకరణ పత్రం వైట్ రేషన్ కార్డు దరఖాస్తుదారుడి ఆధార్ మరియు బ్యాంకు ఖాతా వివరాలు మృతుని వయస్సు రుజువు పత్రం ఐకెపి నుండి నిరభ్యంతర ధ్రువ పత్రం.
దరఖాస్తులు సంబంధిత తహసీల్దార్ కార్యాలయానికి సమర్పించవచ్చు. సబ్ కలెక్టర్ బాన్సువాడ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కోసం కావలసిన పత్రాలు దరఖాస్తు. కుటుంబ సభ్యుల ధ్రువపత్రం. ఆహార భద్రత కార్డు. కుల మరియు ఆదాయ దుకాణ పత్రం. లబ్ధిదారుని ఆధార్ కార్డు, మరణించిన వ్యక్తి ఆధార్ కార్డు మరియు మరణ ధ్రువపత్రం. బ్యాంక్ పాస్ బుక్. మరణించిన వ్యక్తి12-4-2017 కన్న ముందు మరణించకూడదు ఒకవేళ మరణించినట్లయితే లబ్ధిదారునికి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం వర్తించదు. మండల సమైక్య కార్యాలయము నుండి ఎన్ఓసి ధృవ పత్రము, లబ్ధిదారుని చరవాణి సంఖ్య మొత్తము ఉండవలెను