Listen to this article

జనంన్యూస్. 16. సిరికొండ.

అమరుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అమరత్వం చిరస్మరణీయం సిపిఐ (ఎంఎల్) మాస్ జిల్లా నాయకులు ఆర్. రమేష్ స్పష్టికరణ. కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ విప్లవ స్ఫూర్తిని కొనసాగిద్దామని,
అమరుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అమరత్వం చిరస్మరణీయమని సిపిఐ (ఎంఎల్) మాస్ జిల్లా నాయకులు ఆర్. రమేష్ పేర్కొన్నారు సిపిఐ (ఎంఎల్) మాస్ కేంద్ర కంట్రోల్ కమిటీ చైర్మన్ కామ్రేడ్. రాయల. చంద్రశేఖర్ ప్రథమ వర్ధంతి సభను గడ్కోల్ గ్రామంలో నిర్వహించారు. కార్యక్రమంకు ముందుగా కామ్రేడ్. రాయల. చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాల వేసి 2నిముషాలు మౌనం పాటించి నివాళులు హార్పించారు. ఈసందర్బంగా సిపిఐ (ఎంఎల్) మాస్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా నాయకులు ఆర్. రమేష్ మాట్లాడుతు: పార్టీ అదేశాలప్రకారం గా ఎక్కడికి వెళ్లి పనిచేయాలి అన్న పిలుపును అందుకొని పనిచేసిన క్రమశిక్షణ కలిగిన ఆధర్షమూర్తి కామ్రేడ్. రాయల. చంద్రశేఖర్ అన్నారు. 20ఏళ్లుగా రహస్య జీవితం గడిపి గిరిజనులు, ఆదివాసుల కోసం వారితో కలిసి పనిచేసిన గొప్ప విప్లవ నేత అన్నారు. తన అన్న ల ప్రేరణతో విప్లవొద్యంలోకి వచ్చి తన చివరి శ్వాస వరకు ప్రజాపంథా మార్గంలో పోరాటాలను నిర్మించిన కమ్యూనిస్ట్ యోధుడు అన్నారు. కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ను స్మరించు కోవడం అంటే బలమైన విప్లవొధ్యమాలను నిర్మించాడమే నని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్. నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా నాయకులు, డివిజన్, మండల నాయకులు ఆర్. దామోదర్, పి. రమ,ఎం. లింబాద్రి, పి. రామన్న, ఎం. అనిస్, ఎస్ కిశోర్, కట్ట. రాములు, పి.రమేష్, ఆర్. పుష్పలత, ఎం. అప్రోస్ ,,ఎన్. లత తదితరులు పాల్గొన్నారు.