

జనంన్యూస్. 16 నిజామాబాదు. రూరల్.
.ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా …?
.బీజేపి కార్యకర్తను, సిపిఐ ఎంఎల్ పార్టీగా భావించి ఉదయం 5 గంటలకు ఇంటికి వెళ్ళి అక్రమ అరెస్ట్!
.ఉదయం అయిదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కష్టడిలో ఉంచిన ధర్పల్లి పోలీస్ లు!
.బెదిరింపులకు గురిచేశారన్నా భాధితుడు!
.ఇదెక్కడి న్యాయం, ప్రతిపక్షా నాయకులు, వామపక్షా నాయకులు గ్రామంలో పలుచోట్ల గుసగుసలు!
ధర్పల్లి ఎస్ హెచ్ ఓ , పోలీస్ సిబ్బందికి పలు ప్రతిపక్షా పార్టీల నాయకులు ఫోన్ చేసి ప్రశ్నించగా… నా …. పై అధికారుల నుంచి వచ్చిన సమాచారంతో.. అరెస్టు చేశామని సమాధానం ఇచ్చిన ధర్పల్లి ఎస్.హెచ్ ఓ !
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో చోటు చేసుకున్నా సంఘటన, వాట్సాప్లో ప్రశ్నించే గొంతుకలో అడ్మిన్ గా ఉన్న వ్యక్తి మంచికంటి ప్రశాంత్ అనే యువకుడు గత సంవత్సరం క్రితం నుంచి ధర్పల్లి గ్రామంలో అన్యాయాన్ని ఎదిరిస్తూ.. న్యాయం వైపు అడుగులు వేస్తూ పేదల పక్షాన నిలుస్తూ గతంలో ప్రభుత్వము ఇచ్చిన ప్లాట్లును కొద్ది మంది అధికార నాయకులు నేనే నాయకున్ని మాకెవ్వరు లేరు సాటి అని, కబ్జాదారులు ఆ ఫ్లాటును ఇతరులకు విక్రయిస్తే… ఇది నా ప్లాటు అని అడ్డుకోవడమే ఇతను చేసిన నేరమా? న్యాయం వైపు నించోడమే.. అన్యాయం అయితే ….న్యాయాన్ని ఎవరు కాపాడేది? ఈ రోజున చట్టం కూడా అన్యాయానికి మద్దతు చేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉందని, బుధవారం ఉదయం 5 గంటలకు మంచి కంటి (బుడాల) ప్రశాంత్ ఇంటికి ధర్పల్లి పోలీసులు అతని ఇంటిపై దాడి చేసి అరెస్టు చేస్తున్నట్టుగా ప్రకటిస్తూ స్టేషన్కు తీసుకెళ్లడం శోచనీయమని, మంచి కంటి ప్రశాంత్ సిపిఎంఎల్ పార్టీలో చేరినట్టు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? సిపిఎంఎల్ పార్టీ జెండాను మోసినట్లు ఎప్పుడైనా, ఎక్కడైనా చట్టానికి విరుద్ధంగా అఘాయిత్యాలకు పాల్పడినట్టు మీ దృష్టికి వచ్చాయా? అమాయకపు ప్రజలపై అబాండాలను మోపి ప్రజల హక్కులకు భంగం కలిగించడం పోలీసు వారు చేసిన తీరు నేరంగానే భావించబడుతుందని అమాయకులైన ఒక కుటుంబాన్ని చట్టాలను చేతులకు తీసుకొని స్థానిక పోలీస్ అధికారులు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడాన్ని సిపిఎంఎల్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. మంచి కంటి ప్రశాంత్ పై పోలీస్ అధికారులు తీసుకున్న చర్య ఆలోచన రహితమైనదని అన్నారు. ఇకనైనా పోలీసు వారు అమాయకపు ప్రజలపై తీరును మార్చుకోవాల్సిందిగా లేదంటే పోరాటాలు ఆగవని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నిజామాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా అన్యాయాన్ని ఎదురిస్తున్నటువంటి వారిని పోలీసులు ప్రజాస్వామ్య వాదుల్ని అరెస్ట్ చేయడం అంటే ప్రశ్నించే గొంతుకను నొక్కేయడం తప్ప మరోటి కాదని,అన్యాయం ఉన్నంతవరకు ఉద్యమాలు పుట్టుకోస్తాయి తప్ప.. కనుమరుగు కావని మరోసారి గుర్తు చేస్తున్నామని,ఎక్కడైతే వివక్షత అణిచివేత వెట్టి చాకిరి పనికి తగ్గ ఫలితం లేకపోవడం నిర్బంధం ఉంటుందో. అక్కడ ప్రజా పోరాటాలు ముందుకు వస్తాయని,దాని సంకేతమే ఈరోజు ప్రశాంత్ కు జరిగిన సంఘటన కారణమే ఈ అణిచివేతలతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ బాలయ్య అన్నారు. అంతిమ విజయం ప్రజా పోరాటం ద్వారానే ఉంటుందని తెలియజేస్తున్నామని సిపీ ఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసి భీంగల్ సబ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి బాలయ్య మంచి కంటి ప్రశాంతపై జరిగిన సంఘటనను తదితర ప్రతిపక్షా పర్టీల నాయకులు ఖండించారు.