

నాయి బ్రాహ్మణ వృత్తిపై పేటెంట్ హక్కు కల్పించాలి
ఇతర కులస్తులను వృత్తి దోపిడీ చేయకుండా నిరోధించాలి
వృత్తిని కాపాడుకోవడం కోసం ఎలాంటి పోరాటాల కైనా సిద్ధమే
తూముల శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయి బ్రాహ్మణ సేవా సంఘం
కొత్తగూడెం జులై 16 జనం న్యూస్ ఆర్ సి
సృష్టి ఆవిర్భావం నుండిఆదిమానవుడిని మనిషిగా మార్చడం కోసం మానవ శిల్పిగా మంగలి కులస్తుడు మనిషి తలలో గడ్డలు, పుండ్లు, పుడితే వెంట్రుకలు తొలగించి చీము గడ్డలను ఆయుర్వేదం ఆకు పసర్లు ద్వారా నయం చేసిన చరిత్ర నాయి బ్రాహ్మణులది, దేవాలయాలలో మంగళ వాయిద్యలు వాయిస్తూ, దేవుళ్ళను నిద్ర మేలు కోల్పోవడం, షయనింపచేయడం, ఎంతో పవిత్రమైన వృత్తిని సాగిస్తున్న నాయి బ్రాహ్మణులు దేవాలయాలలోని కేశఖండన చేసి తలనీలాలు సమర్పించే భక్తులకు సేవలు అందిస్తూ, మనిషి పుట్టుక మొదలు గిట్టిపోయేవరకు పురుడు పోసి, బారసాలలో నామకరణం చేసి, యుక్త వయసు వచ్చిన అమ్మాయి పుష్పావతి అయితే కాళ్ళ గోళ్ళు తీసి, పెళ్లిలో అమ్మాయికి అబ్బాయికి దిష్టి యంత్రం బియ్యం వడ్లతో మైలపోలు పోసి , వివాహ తంతులో భాగమైనారు నాయి బ్రాహ్మణులు మానవ సమాజానికి
చేసిన సేవలు మంగళ వాయిద్యాలు వాయించడం, పుట్టు వెంట్రుకలు తీయటం, సాంకేతిక శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందక ముందే ఆయుర్వేద వైద్యానికి తొలి డాక్టర్ నాయి బ్రాహ్మణుడు, వివాహ తంతు లో మహిళ పూలు పోయటం పుష్పావతి అయిన యువతికాళ్ళ గోళ్లు తీయటం, కర్మకేశఖండన చేయటం,
ఇవి నాయి బ్రాహ్మణుల జన్మ హక్కు దీన్ని కాదని హక్కు ఈ ప్రభుత్వానికి కానీ ఏ పాలకుడిని గాని లేదు, పాలకులు రాజకీయ లబ్ధి కోసం ఇతర కులాలను ఓట్ల కోసం ప్రోత్సహిస్తూ నాయి బ్రాహ్మణ వృత్తికి అన్యాయం తలపెడితే సహించేది లేదు, ప్రపంచ సరళీకృత ఆర్థిక విధానాల వల్ల ఇతర వృత్తులను వేరే వాళ్ళు ఎంచుకొని చేస్తే ప్రోత్సహించినట్టు నాయి బ్రాహ్మణ వృత్తిని ప్రోత్సహించడం అమానుస చర్యగా భావిస్తున్నాము, తక్షణమే ఈ చర్యకు స్వస్తి పలకాలని తరాల నుండి తలరాతలు మారకుండా మానవ “తలలే” జీవన ఆధారంగా బతుకుతున్న మా బతుకులపై మట్టి కప్పాలని చూస్తే సహించేది లేదు,
ఇతర కులస్తుల సెలూన్లలో కటింగులు గడ్డాలు చేసుకున్న కుటుంబాలు వారింట్లో జరిగే ” కాళ్ల గోళ్ళు” “పుట్టు వెంట్రుకలు”
“మైల పోలు”
‘దిన (కర్మ) కార్యం’
విద్యాధి కార్యక్రమాలు ఇతర కులస్తులతో చేసుకోగలరా? ఆలోచన చేయాలి! పాలకులు ప్రభుత్వ అధికారులు ఎవరైనా మనుషులే మానవ జీవన పరిణామానికి అతి చేరువ ఉన్న ది కేవలం నాయి బ్రాహ్మణులు మాత్రమే అలాంటి నాయి బ్రాహ్మణుల వృత్తినీ ఇతర కులస్తులు దోపిడీ చేయాలని ప్రయత్నిస్తే వారికి ప్రభుత్వాలు గానీ పాలకవర్గం గానీ అండగా ఉంటే అది అమానుస చర్యగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం తీవ్రంగా ఖండిస్తూ, మా వృత్తిపై మాకు “పేటెంట్ హక్కు” కల్పించాలని దేశానికి స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాల గతించిన ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఒక్క నాయి బ్రాహ్మణుడికి ఎమ్మెల్యే గాని ఎమ్మెల్సీ గాని జెడ్పిటిసి గాని ఎంపిటిసి గాని ఇవ్వకపోవడం ఈ రాష్ట్రాలలో ఉన్న అన్ని పార్టీల స్వార్థపూరిత వ్యవహారాన్ని చేతివృత్తుల వారికి చేయూతనందిస్తూ ఆనంద ప్రభుత్వాలు పాలకులు ఈనాటి వరకు నాయి బ్రాహ్మణులకు ఏమీ చేయలేకపోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణిస్తూ గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం గానీ నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలకులు గానీ నాయి బ్రాహ్మణ సంక్షేమ కోసం ఆలోచించకుండా ఇతర కులస్తులను ప్రోత్సహించడం సరైన విధానం కాదని జరగబోయే పరిణామాలకు పాలకులె బాధ్యత వహించాల్సి వస్తుందని నాయి బ్రాహ్మణులపై పాలకుల సవతి ప్రేమను గమనిస్తూనే ఉన్నాం తక్షణమే నాయి బ్రాహ్మణులు హక్కున చేర్చుకొని వారి హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు అండగా నిలవాలని
డిమాండ్ చేస్తున్నాము మా వృత్తిని మేము కాపాడుకోవడం కోసం ఎలాంటి పోరాటానికైనా గసిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం